తెలుగు

ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని మీరు నమ్ముతున్నారా ?

అవినీతి చక్రవర్తి చంద్రబాబు కుంభకోణాల జాబితా

అవినీతి చక్రవర్తి చంద్రబాబు వెబ్‌సైట్‌కి స్వాగతం. చంద్రబాబు నాయుడు చేసిన కుంభకోణాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చేసిన మోసం ఇక్కడ బట్టబయలు అవుతుంది.

చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, కుంభకోణాలు, మోసపూరిత వాగ్దానాల వెనుక దాగిన కఠోర వాస్తవాలను బాగా పరిశోధించి లోతైన పరిశోధనల ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.

చంద్రబాబు చేసిన కుంభకోణాలు, మోసాల వల్ల ప్రజలు ఏమేమి అవకాశాలను కోల్పోయారో, ఏమేమి నష్టపోయారో తెలియజేయడమే మా లక్ష్యం.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్

ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసిన చంద్రబాబు

నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అందించి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు, అదే యువత బంగారు భవిష్యత్తుకు తీరని ద్రోహం చేశారు. ఈ స్కిల్ డెవలెప్మెంట్ స్కాంతో చంద్రబాబు పోగేసిన అవినీతి సొమ్ము అక్షరాలా రూ. 371 కోట్లు. సీమెన్స్‌ నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఒక్క పైసా కూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు విడుదల చేసింది. ఈ స్కాంలో సొంతవారిని అందలం ఎక్కించడంతో పాటు భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

ఈ స్కాంలో ప్రధాన పాత్ర పోషించింది పీవీఎస్‌పీ/స్కిల్లర్‌, డిజైన్‌టెక్‌ కంపెనీలు. ఈ రెండు కంపెనీలు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా సెన్‌వాట్‌కోసం క్లెయిమ్‌ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి... ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టగా డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారం 2017లోనే బయటపడటం విశేషం.

ఏపీ ఫైబర్ నెట్ స్కామ్

అప్పనంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరాసాఫ్ట్‌కు కాంట్రాక్టు అప్పగింత

ప్రజలను కనెక్ట్ చేసే బదులు ప్రజలకు, అభివృద్ధికి మధ్య ఉండాల్సిన కనెక్షన్‌ని కట్ చేసే విధంగా ఫైబర్ నెట్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ పేరు మీద ఒక పెద్ద అవినీతి దందానే నడిపింది అప్పటి టీడీపీ ప్రభుత్వం..

ఈ అవినీతిలో భాగంగా … పారదర్శకత, జవాబుదారీతనంలాంటివి ఏ మాత్రమూ లేని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికిగానూ, అప్పటిదాకా బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్‌ను అక్రమంగా కట్టబెట్టింది. ఈ కాంట్రాక్ట్‌కు సంబంధించి, టెరాసాఫ్ట్ కంపెనీకి చెందిన వ్యక్తులు మరియు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయి.

అమరావతి రాజధాని కుంభకోణం

రాజధాని పేరిట లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పి, చంద్రబాబు ఒకటి కాదు. రెండు కాదు. మూడు కాదు. ఏకంగా నాలుగు రకాలుగా అవినీతి చేసి కోట్ల రూపాయలను దోచుకున్నాడు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ చేసి, టీడీపీ వర్గీయులు నారాయణ, లింగమనేని రమేష్‌, నారా లోకేష్‌ మొదలైన వారి భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ నే మార్చేశారు చంద్రబాబు. ఈ స్కామ్ విలువ మొత్తం 2 వేల కోట్లు.

ఇరిగేషన్ స్కామ్

రైతుల వెన్ను విరిచిన ఇరిగేషన్ స్కాం

రైతులకు వెన్నెముకలా నిలుస్తామని చెప్పిన చంద్రబాబు తన హయాంలో తెలుగు రాష్ట్రాల్లో నీటిపారుదల రంగాన్ని భారీగా అవినీతిపరం చేయడం ద్వారా ఆ రైతుల వెన్నులనే విరిచేసారు.

చంద్రబాబు పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల పేరుతో ఏకంగా 24 వేల కోట్ల రూపాయలను దోచేసారు..

పోలవరం ప్రాజెక్ట్‌, పట్టిసీమ ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ ప్రాజెక్టులలో వివిధ పనులను అధిక ధరలకు కేటాయించడం, బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడంలాంటి ఎన్నో అవకతవకలు జరిగాయి.

టిడ్కో స్కామ్

పేదవాడి సొంతింటి కలను దూరం చేసిన చంద్రబాబు

పేదవాడికి ఎండ, వాన , చలి నుంచి రక్షణ కల్పించే ఇళ్ల పథకాలలోనూ చంద్రబాబు భారీగా అవినీతి చేసి పేదవాడికి నిలువ నీడ లేకుండా చేసాడు. అర్హులైన పేదలకు ఇళ్లు కట్టించాల్సిన టిడ్కోను, టిడిపి నేతలు క్యాష్‌మెషీన్‌గా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి.

చంద్రబాబు పేదవాడి సొంతింటి కలను దూరం చేసి, వారి ఆశలను అడియాశలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి